అధికార దాహంతో అలవిగానీ హామీలిస్తున్నా చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మంగళవారం ఆమె పరిగిలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు ముంగిళ్లలోనే సేవలు అందించారన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వలంటీర్లు ప్రాణాలను తెగించి ప్రజలకు సేవలు అందించారన్నారు. అలాంటి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. వలంటీర్ వ్యవస్థను మాఫీయాగా అభివర్ణించారన్నారు. కానీ సోమవారం పెనుకొండలో నిర్వహించిన సభలో వలంటీర్ వ్యవస్థపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ మాట్లాడటం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
సోమవారం పెనుకొండలో నిర్వహించిన ‘రా కదలి రా’ సభ టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్వాన సభగా మంత్రి ఉషశ్రీ అభివర్ణించారు. ఆయనకు ఇదే రాజకీయ చివరి సభగా మారనుందన్నారు. ఇప్పటికే వయోభారంతో ఉన్న ఆయన.. తన కుమారుడు లోకేష్‌ను గద్దెనెక్కించడానికి జనసేన పార్టీని అద్దెకు తెచ్చుకున్నారన్నారు. అందువల్లే జనం కూడా పెద్దగా మద్దతు తెలపడం లేదన్నారు. పెనుకొండ సభకు వచ్చిన జనమే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో సగభాగం కూడా టీడీపీ ‘కదలి రా’ సభకు ప్రజలు రాలేదని ఎద్దేవా చేశారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ, వలంటీర్ వ్యవస్థలతో అవినీతి అక్రమాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. దీనిపై ఓపెన్ ఛాలెంజ్‌కు సిద్ధమన్నారు. అన్ని వర్గాలకూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే అండగా నిలబడిందన్నారు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ఏపీలోని కోట్లాది ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. టీడీపీ, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా చివరికి జగనన్నపై ప్రజలకు ఉన్న విశ్వసనీయతను ఎవరూ చెడగొట్టలేరన్నారు. చల్లటి గాలినిచ్చే ‘ఫ్యాను’ స్పీడును ఆపడం టీడీపీ, జనసేన, పచ్చ మీడియాకు సాధ్యం కాదన్నారు.
source : sakshi.com
Discussion about this post