మూడు రాజధానులంటూ ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెడుతున్న ఏపీ సీఎం జగన్.. మరోసారి విశాఖ జపం చేశారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. ‘విజన్ వైజాగ్’ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే ఉంటా. ఈసారి సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా. నగర అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళిక అవసరం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయలేదు. కేంద్రం సహకారం ఉండాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలి. సమష్టిగా కృషి చేస్తేనే విశాఖ నగరం మారుతుంది. అమరావతికి నేను వ్యతిరేకం కాదు. శాసన రాజధానిగా అది కొనసాగుతుంది. అక్కడ 50వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
source : eenadu.net
Discussion about this post