భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పోరు యాత్ర ఏడవ రోజు అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శ్ కుమార్ నల్లపేట ఆధ్వర్యంలో స్థానిక హిందూపురంలోని చిన్న మార్కెట్, వాల్మీకి సర్కిల్, బాల యేసు స్కూలు, మరియు భగీరథి సర్కిల్ నందు యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా రాష్ట్ర నాయకులు తిరుపతి జిల్లా ఇన్చార్జి పిడి పార్థసారథి, జిల్లా ప్రజా పోరు యాత్ర కో కన్వీనర్ కే.వి.చలపతి, జిల్లా ఉపాధ్యక్షులు వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్ల మంది జనాభా కి ప్రతినెల ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని తెలియజేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి కొళాయి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా రాష్ట్రంలో 24 లక్షల ఇల్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పదేళ్లయిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయకపోవడం ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే స్థానిక భగీరథ సర్కల్లో ఉన్న అంగన్వాడి సెంటర్ ను నాయకులు పరిశీలించి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా పిల్లలకు ఇస్తున్న పౌష్టిక ఆహారాలు గర్భవతులకు బాలింతలకు ఇస్తున్న పౌష్టిక ఆహారాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని అక్కడున్న వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అంగన్వాడి సెంటర్ పరిశీలించిన తర్వాత ఆ సెంటర్లో కనీసం కరెంటు సదుపాయం లేని విషయాన్ని గమనించడం జరిగింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంగన్వాడి సెంటర్లకు మరుగుదొడ్లు మంజూరు చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్ళించింది అని తెలియజేయడం జరిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పంచాయతీకి నేరుగా నిధులు ఇస్తున్న గత ఐదు సంవత్సరాలలో కిరికిరి పంచాయతీకి దాదాపు 6 కోట్ల 50 లక్షలు నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి గ్రామ అభివృద్ది కుంటిపడేలా చేసిందని ప్రజలకు తెలియజేయడం జరిగింది. కోట్లల్లో కేంద్రం నుండి నిధులు వస్తున్న ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు కూడా తీర్చకపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రజలకి నీటి సౌకర్యం కోసం నిర్మించిన వాటర్ ట్యాంక్ పైన మూతలు లేకపోవడం అందులో నీరు కలుషితం మైన విషయం గమనించి పంచాయతీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మరియు కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ప్రజాపోరు కన్వీనర్ శంకర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణప్ప, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, శేఖర్, పాత లింగప్ప, మూర్తి, మోహన, లక్ష్మీనారాయణ, రమేష్, జనార్ధన, గోవిందరాజులు మరియు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
Discussion about this post