మహా మహా దిగ్గజాలతో కనీసం వారితో అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం. ఇటువంటి సందర్భాల్లో ఏకంగా మహా దిగజాలైన నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఫారుక్ అబ్దు ల్లా అదేవిధంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజ య్ సింగ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సీతారాం ఏచూరి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ డి రాజా బెంగళూర్ శివాజీ నగర్ ఎమ్మెల్యే రిజ్వాన్ ఇలా మహా మహా దిగ్గజాలతో ఈనాయతుల్లా ఇటీవల బెంగళూరులో ప్రత్యేక సమావేశంలో ఆయన భేటీ అ య్యారు. ఆయన వీరితో భేటీ అవ్వడం పట్ల ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాశంగా మారింది. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇటీవల జాతీయ స్థాయి నాయకులతో కలిసి రావడం జరిగింది అని వారు నాకు సాదరంగా మర్యాదపూర్వకంగా వారు నాతో కలిసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో జరుగు రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరు గుతున్న రాజకీయ పరిస్థితులు కలిసి దాదాపు గంట సేపు చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది అన్నారు. ఆం ధ్ర రాష్ట్రాన్రికి రాజధాని కూడా లేదని ఇలా ఎన్నో విషయా లను ఆంధ్ర రాష్ట్రం గురించి చర్చించడం జరిగింది అన్నా రు. కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమవుతుందన్న విష యాన్ని వారు ప్రస్తావించడం జరిగింది అన్నారు.
నాకు ఎ న్నో ఏళ్లుగా వారితో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపా రు. అయితే హిందూపురం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీకి సిద్దమవుతున్నట్లు తెలుపుగా దానికి వారు సంతోషం వ్య క్తం చేయడం జరిగిందన్నారు. తాను ఇప్పటికి నేషనల్ పా ర్టీ లీడర్ అని తనకు ప్రజల్లో మంచి బ్రాండ్ ఉందని ఆయ న తెలిపారు. వాస్తవంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏ ర్పడుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాజ కీయ సమీకరణాలు మార్పులో భాగంగా తాను ముందు కెళ్లడం జరుగుతుందని తెలిపారు. వాస్తవంగా నాకు ప్ర జల మద్దతు అదేవిధంగా ముఖ్యంగా హిందూ మైనార్టీ
సోదరులు అందరు పూర్తిగా సహాయ సహకారాలు నాకు అందిస్తున్నట్లు అందులో భాగంగానే నేను ఈసారి అభ్య ర్థిగా బరిలో ఉంటానని తెలపడం జరుగుతుందన్నారు. ఇ కపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బయోడేటా ను పంపిం చడం జరిగిందన్నారు. అయితే వారు కూడా మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అన్నారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా అన్ని పార్టీలు తన కు ఒత్తిడి చేశాయని అయితే తన ధ్యేయం ఎమ్మెల్యే అభ్యర్థి గానే పోటీ చేసి స్థానికంగా గెలిచి హిందూపురం నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోవాలన్న సంకల్పంతోనే తన ఈ విధంగా ఈరోజు మీతో ప్రస్తావించడం జరుగుతుందన్నారు.
Discussion about this post