ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా ఆరవ రోజు హిందూపురం మండలంలోని చలివెందల మరియు బాలంపల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇస్తున్న సంక్షేమ పథకాలు వివరించడం జరిగింది. అలాగే కేంద్రం నుండి వస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని స్థానికులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ గ్రామాల్లో ప్రధానమంత్రి మోడీ గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి ప్రతి మున్సిపాలిటీకి జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా నిధులు కేటాయిస్తున్నారు. బాలంపల్లిలో ఈ పథకానికి సంబంధించి ఏడు లక్షల 50 వేల రూపాయలు కేంద్రం పంచాయతీకి విడుదల చేసిన ఇప్పటికీ మంచినీటి కొళాయి అందినటువంటి ప్రజలందరినీ తీసుకుని వెళ్లి స్థానిక సచివాలయంలో అధికారులతో మాట్లాడి త్వరలోనే ప్రతి ఇంటికి కొళాయి ఇస్తున్నాము అని అధికారులతో ప్రజలకు చెప్పించడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఇలా ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ వెళుతూ అక్కడున్న సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే సచివాలయం సిబ్బంది మరియు అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించడం జరిగింది.

Discussion about this post