హిందూపురం పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ నందు మోడీ ప్రభుత్వం యొక్క గ్యారెంటీ శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త T N, దీపిక గారు, హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి “D N, ఇంద్రజ” గారు
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా మన హిందూపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 17.00 కోట్లు విడుదల చేయడం జరిగింది. . హిందూపురం వైఎస్ఆర్సిపి నాయకుల కృషి వల్ల జగనన్న పట్టుదల వల్ల నేడు ఫలితం లభించడంతో చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గౌరవ మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి ఇంద్రజ గారు మాట్లాడుతూ అమృత భారత్ స్టేషన్ పథకం కింద 554 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ది లో భాగంగా హిందూపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 17.00 కోట్లతో రూప్ ప్లాజా, ఎక్స్రేటర్, లిప్ట్, కోచ్ ఇండికేషన్ బోర్డులు , వెయిటింగ్ ఏరియా, ఎగ్జికూటివ్ లాంజ్ మరియు వికలాంగుల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుతుందని తెలియజేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు మరియు పత్రికల బృందం ,రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post