జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా శాంతి పార్టీ తరఫున పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని.. అందుకు ఎంత డబ్బు కావాలో చెప్పాలని పవన్‌ను కోరారాయన సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..పవన్‌కు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ప్రజా శాంతి పార్టీలో చేరితే గనుక పవన్నే సీఎం చేస్తాం. మా పార్టీలో చేరడానికి ఎంత డబ్బు కావాలో పవన్ చెప్పాలి అంటూ పాల్ వ్యాఖ్యానించారు. టీడీపీతో జనసేన పొత్తును కాపులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారాయన. అభ్యర్థుల్ని ప్రకటించే టైంలో వేదిక మీద చంద్రబాబు పక్కనే ఉన్న పవన్‌లో బాధ కనిపించిందన్నారు. అలాగే.. టీడీపీ జనసేనలు రాష్ట్రాన్ని దోచుకోవడానికి సంసిద్ధం అంటున్నాయని.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దని ఏపీ ప్రజలకు కే ఏ పాల్ విజ‍్క్షప్తి చేశారు.
source : sakshi.com
Discussion about this post