ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్ కళాశాలలో విద్యార్థులకు కళాశాల ఫీజులకు సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి హాల్ టికెట్లు అందించి పరీక్ష రాసే విధంగా చూడాలన్నారు ఈ సమయంలో కళాశాల ఫీజుల పేరుతో విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను వేధించడం సరికాదని అన్నారు ఏ కళాశాలైన విద్యార్థులకు ఫీజుల పేరుతో వేధిస్తే అలాంటి కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తాము అన్నారు అదేవిధంగా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న విద్యాసంస్థల పైన విద్యాశాఖ అధికారులు స్పందించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్రశేఖర్ తరుణ్ భగత్ మహేష్ పవన్ పాల్గొన్నారు
Discussion about this post