యూజ్ అండ్ త్రో పాలసీ విజయవంతంగా అమలు చేసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పార్టీ నాయకుల్ని కూడా విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. గుంటూరు ఎంపీ టిక్కెట్ ఇస్తామంటూ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇద్దరు కోటీశ్వరుల్ని మ్యాగ్జిమం ముంచారు. ఇప్పుడా ఇద్దరూ ఎంపీ సీటు తనదే అంటూ కొట్లాడుకుంటున్నారు. ఇద్దరిలో ఒక మేధావి చంద్రబాబు మార్క్ రాజకీయాల్ని ఒంటబట్టించుకున్నాడు. తన ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నాడు. అలాగైనా తనకు సీటు వస్తుందని ఆశపడుతున్నాడు.
గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గుంటూరు ఎంపీ సీటుకోసం ఇద్దరు బడాబాబులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకరు భాష్యం విద్యాసంస్థల అధిపతి బాష్యం రామకృష్ణ అయితే మరొకరు ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్. వాస్తవానికి గత ఎన్నికల్లో బాష్యం రామకృష్ట పెదకూరపాడునుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించారు. చివరివరకూ సీటు నీకేనంటూ మాయమాటలు చెప్పి ఆఖరులో బాష్యం రామకృష్ణకు హ్యండిచ్చారు చంద్రబాబు.
ఈసారి ఎన్నికల్లో అయినా ఏదో ఒక అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చెయ్యాలని రామకృష్ణ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. విద్యా వ్యాపారంతో దండిగా సంపాదించిన బాష్యం రామకృష్ణ వద్ద వందల కోట్లు ఉండడంతో నీకు అసెంబ్లీ సీటు ఎందుకు..? పార్లమెంట్ సీటుకు పోటీ చేయమని ఆయన్ను ఊహల పల్లికిలో ఊరేగించారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయడానికి 150కోట్లు రెడీ చేసుకోమని కూడా చెప్పేశారట. చంద్రబాబు చెప్పిందే తడవుగా ఎంపీగా పోటీ చేయడానికి ఆయన డబ్బు కూడా రెడీ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
source : sakshi.com
Discussion about this post