ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో సుమారు 2500 మంది పేదల కోసం హనుమంతుపాలెం వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 50 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి. లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. నాలుగున్నరేళ్లుగా పనులు నిలిచిపోవడంతో అసంపూర్తి గృహాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఆ ప్రాంతం చిట్టడవిని తలపిస్తోంది.
source : eenadu.net
Discussion about this post