చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేక పోయారన్నారు.
వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కుప్పం ప్రజలకు మంచినీళ్లు ఇస్తోందని చెప్పారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు.
source : sakshi.com
Discussion about this post