చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ కార్యక్రమ జిల్లా కన్వీనర్ ఏసీ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. పత్తికొండ తెదేపా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. గత ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి యువతకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా నిరుద్యోగులతో ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌ను గద్దె దింపాలని యువతకు సూచించారు.
source : eenadu.net
Discussion about this post