చంద్రబాబు మాటలు నీటి మూటలంటూ మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పేవి అన్నీ అసత్యాలు.. అబద్దాలేనంటూ ధ్వజమెత్తారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కాదా? గ్రామాల్లోకి వచ్చి కళ్లు పెట్టుకుని చూస్తే తెలుస్తుందంటూ ఎల్లో మీడియాపై మంత్రి నిప్పులు చెరిగారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో తునిలో ప్రతి గ్రామం ప్రశాంతంగా ఉంది. అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని తునిలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. నేను కళ్లు ఎర్ర చేస్తే చాలు మీ అంతు తేలుతుంది. నేను ప్రతిపక్షంలో ఉండగా కళ్లు ఎర్ర చేస్తే మీరు ఇళ్లు, వాకిలి వదిలి ఏవీ నగరంలో దాకున్నారు’’ అంటూ దాడిశెట్టి రాజా మండిపడ్డారు.
source : sakshi.com
Discussion about this post