వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియా (సామాజిక మధ్యమాలు)లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయింది.
సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వైఎస్సార్‌సీపీ అభిమానులు భారీ ఎత్తున ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు చేశారు. జనసంద్రాన్ని తలపిస్తున్న ‘సిద్ధం’ సభా ప్రాంగణం, సభకు హాజరైన ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్న జనం ఫొటోలతో సామాజిక మాధ్యమాలు నిండిపోయాయి.
వైఎస్ జగన్ ఎగైన్, ఎండ్ ఆఫ్ టీడీపీ హ్యాష్‌ట్యాగ్‌లతోనూ ‘సిద్ధం’ సభ విశేషాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ అభిమానులు హోరెత్తించారు. తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి మరోమారు దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది.
source : sakshi.com
Discussion about this post