రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచింది. వైఎస్ జగన్ వస్తే ప్రభంజనమేనని మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 175, 25 లోక్‌సభ స్థానాల్లో 25 గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లక్షలాది జనం బ్రహ్మరథం పట్టారు.
రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల నుంచి వేలాది వాహనాల్లో ప్రజలు తరలివచ్చారు. సభా వేదికపైకి సీఎం జగన్ చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇంకా లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్– బెంగళూరు, అనంతపురం–చెన్నై జాతీయ రహదారులపై ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
అనంతపురం–చెన్నై జాతీయ రహదారిలో ఎస్కే యూనివర్సిటీ దాటి సంజీవపురం వరకు 12 కిలోమీటర్ల పొడవునా, ఇటు రాప్తాడు వైపు బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరూరు టోల్‌గేట్, మరో వైపు రాప్తాడు నుంచి అనంతపురం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణంలో ఎన్ని లక్షల మంది ఉంటారో.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వారు అంతకు మించే ఉన్నారని అనంతపురం నగరం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
‘సిద్ధం’ అని నినదించిన లక్షలాది గొంతులు
దుష్ట చతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్ చేసిన రణ గర్జనకు ..‘సిద్ధం’ అంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్కచేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. పెత్తందారులతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది.
పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసే నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? అని అడిగిన ప్రశ్నలకు.. లక్షలాది మంది టార్చ్ ఆన్ చేసిన మొబైల్ ఫోన్లను చేత్తో పట్టుకుని చూపుతూ ప్రతిస్పందించారు.
source : sakshi.com
Discussion about this post