నాడు-నేడు పనులు పూర్తి చేయకుండానే పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని అబద్ధాలు ప్రచారం చేయడంలో సీఎం జగన్ గోబెల్స్‌ను మించిపోయారు. భారీ హోర్డింగ్‌లతో ప్రచారం ఊదరగొడుతున్నారు. కార్యక్రమం ప్రారంభించి నాలుగున్నరేళ్లు గడిచినా ఇంతవరకు రెండో విడతకే దిక్కులేకుండా పోయింది. మొదటి విడతలోనూ తరగతి గదుల నిర్మాణాలు పూర్తి కాలేదు. 2019 నవంబరు 14న నాడు-నేడు మొదటి విడత పనులకు ప్రారంభోత్సవం చేయగా.. 2021 ఆగస్టు 16 నాటికి వీటిని ముగించారు. అదే రోజున రెండో విడతకు శ్రీకారం చుట్టారు. సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. నిధులు లేవని గతేడాది ఆరు నెలలపాటు పనులను వాయిదా వేశారంటే జగన్ ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 44,478 పాఠశాలలు ఉంటే మొదటి విడతలో 15,713 బడుల్లో పనులు చేశారు. రెండో విడతలో 16,493 బడుల్లో చేపట్టారు. మొదటి విడతలో చేపట్టిన 3,615 బడుల్లోనూ ఇప్పుడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. 12,272 పాఠశాలల్లో ఇంతవరకు ఎలాంటి పనులు జరగలేదు.
source : eenadu.net










Discussion about this post