సీఎం వైఎస్ జగన్ పర్యటన వివరాలను ఉన్నతాధికారులు శనివారం తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 2.55 గంటలకు బయలుదేరి 3.15 గంటలకు రాప్తాడు వస్తారు. 3.20 గంటలకు హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 3.30 నుంచి 5 గంటల వరకూ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.35 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. 6.30 గంటలకు అక్కడికి చేరుకుని 6.55 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.
source : sakshi.com
Discussion about this post