రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా ఇదే పరిస్థితి రానుందని వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఎండాడలో గల పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్రలో గల 34 నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పరిశీలకులతో ఆయన సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రులు వలంటీర్లు అని, 57 నెలల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను మరోమారు ప్రజలకు గుర్తు చేసే హక్కు వారికి ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు బెదిరింపులకు పాల్పడతున్న విషయాన్ని గుర్తు చేశారు. అసలు టీడీపీ, జనసేనలకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు కుర్చీ మడత పెట్టడానికి వారికి కుర్చీనే లేదన్నారు. విధ్వంసం పుస్తకం రాసిన వాళ్లు, ఆవిష్కరించిన వాళ్లను చూస్తేనే దాని వెనుక ఉన్న విధ్వంసం అర్థమవుతోందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఉన్నారు.
source : sakshi.com
Discussion about this post