‘అంబేడ్కర్ విదేశీ విద్య’ పేరును ముఖ్యమంత్రి జగన్ మార్చడాన్ని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ సమర్థించారు. శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘అంబేడ్కర్ పేరును తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నా మాకు ఆనందమే. తెదేపా హయాంలో అంబేడ్కర్ పేరుతో విదేశీ విద్యకు ఒక్కో విద్యార్థికి రూ.15 లక్షలు ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఇస్తోంది. గతంలో కంటే డబ్బులు పెంచినందున అంబేడ్కర్ పేరును తీసేసినా తప్పుకాదు. జగన్ పేరు పెట్టుకున్నా, తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టుకున్నా తప్పు కాదు. మాకు డబ్బులే ముఖ్యం. అంబేడ్కర్ పేరు కాదు’ అని వ్యాఖ్యానించారు.
source : eenadu.net
Discussion about this post