టీడీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన విద్యావ్యవస్థను అధికారం చేపట్టగానే గాడిలో పెట్టిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే విద్యా సాధికారిత సాధ్యమని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్మవరంలో సోమవారం నిర్వహించిన ‘విద్యార్థుల సాధికారత జగనన్నతో సాధ్యం’ కార్యక్రమం విజయవంతమైంది. కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థులు హాజరై ‘జయహో జగన్ మామయ్య’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి కాలేజ్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, గాంధీ సర్కిల్, మారుతీ రాఘవేంద్రస్వామి కల్యాణ మంటపం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి హాజరయ్యారు.
source : sakshi.com
Discussion about this post