రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఫైనల్ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. విశాఖలోని ఎనిమిది వేదికల్లో ఐదు క్రీడాంశాల్లో పురుషుల, మహిళల జట్ల మధ్య ఫైనల్స్‌ను ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.
మహిళల విభాగంలో..
► క్రికెట్ విజేతగా ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థ నగర్, రన్నరప్‌గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, సెకండ్ రన్నరప్‌గా ప్రకాశం జిల్లా చిరకూరపాడు జట్లు నిలిచాయి.
► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా నిజాంపట్నం–3, రన్నరప్‌గా కర్నూలు జిల్లా మామిడాలపాడు–1, సెకండ్ రన్నరప్‌గా అన్నమయ్య జిల్లా కుచ్చువారిపల్లి–1 జట్లు నిలిచాయి.
► బ్యాడ్మింటన్ విజేతగా బాపట్ల జిల్లా స్వర్ణ 2, రన్నరప్‌గా వైఎస్సార్ జిల్లా శంకరాపురం–4, సెకండ్ రన్నరప్‌గా కర్నూలు జిల్లా ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ జట్లు నిలిచాయి.
► ఖోఖో విజేతగా ప్రకాశం జిల్లా పోలిరెడ్డి బజార్, రన్నరప్‌గా కృష్ణా జిల్లా నెహ్రూ సెంటర్ చౌక్, సెకండ్ రన్నరప్‌గా కాకినాడ జిల్లా బీసీ కాలనీ 2 జట్లు నిలిచాయి.
► కబడ్డీ విజేతగా విశాఖ జిల్లా లాసన్స్‌బే కాలనీ, రన్నరప్‌గా ప్రకాశం జిల్లా పాకాల 2, సెకండ్ రన్నరప్‌గా అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెం జట్లు నిలిచాయి.
► బ్యాడ్మింటన్ విజేతగా ఏలూరు జిల్లా శేఖర్ వీధి, రన్నరప్‌గా తిరుపతి జిల్లా భేరీపేట, సెకండ్ రన్నరప్‌గా వైఎస్సార్ కడప కాగితాలపెంట 1 జట్లు నిలిచాయి.
► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా బేతపూడి, రన్నరప్‌గా మన్యం జిల్లా బలిజపేట, సెకండ్ రన్నరప్‌గా చిత్తూరు జిల్లా కొత్తపల్లె జట్లు నిలిచాయి.
► ఖోఖో విజేతగా బాపట్ల జిల్లా పొంగులూరు –1, రన్నరప్‌గా అనకాపల్లి జిల్లా తుమ్మపాల–2, సెకండ్ రన్నరప్‌గా ప్రకాశం జిల్లా రుద్రవరం జట్లు నిలిచాయి.
‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలను ప్రభుత్వం నేడు అట్టహాసంగా నిర్వహించనుంది. విశాఖ సాగర తీరంలో లేజర్ షోతో పాటు డ్రోన్ షోలు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ అండ్ లైటింగ్ షోకు శాప్ ఏర్పాట్లు చేసింది. ఎల్‌ఈడీ కాంతుల్లో 150 మంది కూచిపూడి నృత్యకారులతో ఆడుదాం ఆంధ్రపై కళా ప్రదర్శన నిర్వహిస్తారు. బాణసంచా వెలుగులు ఆహుతుల్ని అలరించనున్నాయి.
source : sakshi.com
Discussion about this post