వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించొద్దంటూ సోమవారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమర్రి పంచాయతీ రైతులు నిరసన వ్యక్తం చేశారు. కల్లుమర్రిలో రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు వచ్చిన విద్యుత్తు శాఖ సిబ్బందిని అడ్డుకున్నారు. బోరుబావుల కింద పంటలు సక్రమంగా పండడం లేదని, దిగుబడులు లేక అప్పుల పాలవుతున్న సమయంలో బోర్లకు మీటర్లు అమర్చడం రైతులకు ఉరితాడు బిగించడమేనంటూ మండిపడ్డారు. స్థానిక సర్పంచి గంగమ్మ, తెదేపా యూనిట్ ఇన్‌ఛార్జి నాగరాజు, రైతులు సదాశివప్ప, నరసింహప్ప, నర్సేగౌడు, ప్రభాకర్, కొండప్ప, ముని, నరసింహారెడ్డి, సత్యనారాయణ, గోవర్ధన్, సోమశేఖర్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post