వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ఓటుతో చరమగీతం పాడుదామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెడపల్లిలో వైకాపాకు చెందిన పలు కుటుంబాలు మాజీ సర్పంచి శ్రీరామ్‌నాయక్ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. వారికి మాజీ మంత్రి పల్లె, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, తెదేపా జిల్లా కార్యదర్శి అంబికాలక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మండల కన్వీనర్ విజయ్‌కుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లతో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. విభేదాలు వీడి సమష్టిగా పార్టీ విజయానికి సైనికుల్లా పనిచేయాలని శ్రేణులకు పిలపునిచ్చారు. ముఖ్యమంత్రి తీరుకు సొంత కుటుంబ సభ్యులే అసహ్యించుకునే దుస్థితికి దిగజారారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు.
source : eenadu.net
Discussion about this post