వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వై రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న జైత్రయాత్ర కొనసాగడం ఖాయమని స్పష్టం చేశారు. గురువారం యాత్ర సినిమా విడుదల సందర్భంగా నగరంలో పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐటీ వింగ్ రీజినల్ కో ఆర్డినేటర్ సుధీర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు సుబ్బ రాయల్, చంద్రమోహన్, శ్యాం, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నరేంద్ర రెడ్డి, కో కన్వీనర్ బ్రహ్మారెడ్డి, వెంకటేష్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post