అత్యుత్సాహం వద్దు.. లేదంటే బ్రేకులు పడతాయి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ కార్యకర్తలను హెచ్చరించిన ఆడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఇటీవల వైకాపా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా విరూపాక్షిని ప్రకటించింది. ఆ సమయంలో ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన కార్యకర్త వీరేష్ వెళ్లి విరూపాక్షిని కలిశారు. మంత్రి జయరాం వీరేష్‌తో చరవాణిలో మాట్లాడుతూ.. ‘ఆరోజే నాగరాజు నిన్ను చంపుతామని చెబితే.. నేనే కాపాడా.. నువ్వు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు జాగ్రత్తగా ఉండు’ అని ఘాటుగా హెచ్చరించారు. వీరేష్ మంత్రికి సమాధానమిస్తూ.. ‘మీ కోసం ప్రాణాలు ఇచ్చేలాగా కష్టపడ్డాం.. అయినా మాకేం చేశారు. రౌడీషీటర్ జాబితాలో నుంచి నా పేరు తొలగించేలా చేయలేదు’ అని అన్నారు. ఇద్దరి మధ్య సంభాషణ వైరల్‌గా మారింది.
source : eenadu.net










Discussion about this post