గతంలో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు నిత్యావసరాలు తీసుకునేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇదంతా ప్రజలకు ఇబ్బంది అని ఇంటి వద్దకే రేషన్ సరకులు అంటు రూ.కోట్ల ప్రజాధనంతో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలకు రేషన్ అందిస్తున్నారు. అయితే ఇంటి వద్దకే అన్నది ఏమో కాని చిత్తూరులోని శివాలయం వీధిలో మండుటెండలో క్యూలో నిలబడి ప్రజలు రేషన్ తీసుకుంటున్నారు. వాహనం వచ్చినప్పుడే తీసుకోవాలి. ఒకవేళ లబ్ధిదారులు అందుబాటులో లేకుంటే అంతే సంగతి.
source : eenadu.net
Discussion about this post