రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మహిళలకు ఒక్క మంచి పథకం అమలు చేయలేకపోయాడని, టీడీపీని ఓడించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శశికళారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బిర్లా కాంపౌండ్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈనెల 11న అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగనన్న నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్లను ఆమెతో పాటు పార్టీ మహిళా నాయకురాళ్లు ఆవిష్కరించారు. మహిళల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో 33 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు వారిపేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
మళ్లీ జగనన్నకే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టబోతున్నారన్నారు. వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్‌ను వెంట పెట్టుకొని పోత్తులకు వెళ్తున్నాడన్నారు. రాష్ట్రంలో మహిళల ఆశీస్సులు జగనన్నకు మెండుగా ఉన్నాయన్నారు. 25 ఎంపీ సీట్లు, 175 అసెంబ్లీ సీట్ల గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు. సిద్ధం సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

source : sakshi.com
Discussion about this post