ప్రజల్లో ఉనికి కోల్పోయిన టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఎన్నికల ముందు కుయుక్తులకు తెరలేపుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులకు బలవంతంగా తమ పార్టీ కండువాలు వేసి టీడీపీలో చేరారంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారు. తీరా అంతా అబద్ధమేనని తేలాక తెల్లమొహం వేస్తున్నారు. అందుకు బుధవారం జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. పట్టణంలోని 9వ వార్డులో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ అరవ శివప్ప సోదరుడు శ్రీనివాసులు బుధవారం ఉదయం టిఫిన్ తినేందుకు బంధువుల ఇంటి వద్దకు వెళ్తుండగా, టీడీపీ నేతలు ఆపారు. బలవంతంగా ఆయన భుజంపై టీడీపీ కండువా వేశారు. తమ పార్టీలో చేరాడంటూ నానా హంగామా చేశారు. ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న కాలవ శ్రీనివాసులు ఆయనతో పాటు టీడీపీకే చెందిన మరో 40 కుటుంబాల వారికి పార్టీ కండువాలు వేసి పెద్ద సంఖ్యలో చేరారంటూ డబ్బా కొట్టుకున్నారు.
ఈ కార్యక్రమం జరిగిన కొద్దిసేపటికే అసలు బాగోతం వెలుగుచూసింది. తమకు బలవంతంగా టీడీపీ కండువాలు కప్పారంటూ వారంతా మండిపడ్డారు. ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ శివప్ప, చేనేత, జౌళి శాఖ జిల్లా అధ్యక్షులు కూన నాగప్ప, పార్టీ నాయకుడు పొరాళ్ల శివ, కౌన్సిలర్లు పొరాళ్ల గోవిందరాజులు, కొంతెం దేవరాజు, తట్టే మంజు, వార్డు ఇన్‌చార్జులు స్టోర్ బుజ్జి, దివాకర్, గోరంట్ల సత్యనారాయణ, నిజామ్ మాట్లాడుతూ కుటుంబాల మధ్య చీలికలు తెచ్చే నీచ రాజకీయాలను కాలవ శ్రీనివాసులు మానుకోవాలన్నారు. అయినా, టీడీపీ దివాళా తీసిన పార్టీ అని ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత మునిగిపోయే నావను ఎక్కాలని ఎవరు కోరుకుంటారో చెప్పాలంటూ నిలదీశారు.
source : salkshi.com
Discussion about this post