రాజ్యసభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీకానుంది. తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికెషన్ విడుదలైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 15 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఈనెల 16న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20 వరకు గడవు విధించారు.
తెలంగాణలో ఉన్న మూడు స్థానాల్లో రెండు అధికార కాంగ్రెస్ కు, ఒకటి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు నామినేషన్ వేసే అవకాశం ఉంది. మూడు కన్నా ఎక్కువ నామినేషన్‌లు పడితే ఎన్నికల నిర్వహణ జరపాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఈ నెల 27న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
source : sakshi.com
Discussion about this post