సీట్ల పంపకం తేలడం మాటేమోగానీ.. టీడీపీ-జనసేన కొట్లాటలు మాత్రం రోజుకో చోట బయటపడతున్నాయి. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో.. అదీ ఆయన సమక్షంలోనే ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగడం గమనార్హం. గంగాధర(జీడీ) నెల్లూరులో చంద్రబాబు నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ- జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ- జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ జెండాలను కట్టిన కర్రలను తీసుకుని టీడీపీ కార్యకర్తలు జనసేన సానుభూతిపరులను తరిమి కొట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే చంద్రబాబు సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం. అందుకు కారణం ఏంటో తెలుసా?.. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ కొంతమంది జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారట. టీడీపీ కార్యకర్తలు అది భరించలేకే.. ఇలా డిష్యుం డిష్యుంకి దిగారు.
source : sakshi.com
Discussion about this post