చిల్లిగవ్వ నిధులు ఇవ్వకుండా బెస్తల కార్పొరేషన్ ఏర్పాటుతో వైకాపా నాయకులకు పదవులిచ్చిన జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని తెదేపా బెస్త సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ యాటగిరి రాంప్రసాద్ పిలుపునిచ్చారు. మండలంలోని హులికెరలో మంగళవారం బెస్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత తెదేపా ప్రభుత్వం బెస్తల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. బెస్తలు అభ్యున్నతి సాధించాలంటే మరలా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. బెస్త నాయకులు నారాయణస్వామి, హరి, విజయ్‌కుమార్, నరేశ్, పెద్దన్న పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post