అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం ఆవులన్న గ్రామానికి.. కళ్యాణదుర్గం ప్రధాన మార్గం నుంచి 1.6 కిలోమీటర్ల దూరం గల గ్రావెల్ దారి గుంతులు పడి అధ్వానంగా మారడంతో నాలుగేళ్లుగా రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి నిధులు సమకూరలేదు. మరమ్మతులు చేయించాలని గ్రామ సర్పంచి రామ్మోహన్ మండల సాధారణ సమావేశాల్లో పదేపదే ప్రస్తావించారు. దీంతో విసిగి వేసారి ప్రజల ఇబ్బందిని తీర్చడానికి ఆయన ఓ అడుగు ముందుకేశారు. రూ.1.80 లక్షలు తన సొంత డబ్బులను వెచ్చించి రోడ్డును చదును చేయించారు. గ్రామస్థులు ఆయనను అభినందించారు.
source : eenadu.net










Discussion about this post