తాడిపత్రిలో వాలంటీర్ల హెచ్చరికలు
మొన్నటివరకు ఓటర్ల జాబితాపై కుట్రలు చేసిన వైకాపా నాయకులు ఇప్పుడు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇందుకోసం వాలంటీర్లను రంగంలోకి దింపారు. ఓటరు సర్వే పేరుతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఇంటింటికీ వెళ్లి.. జాబితాలోని కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజాప్రతినిధి చెప్పడంతోనే వారిలా చేస్తున్నారని తెలిసింది.
source: eenadu.net










Discussion about this post