రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపిచాలని పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాథనాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించేందుకు జన సైనికులతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలన్నారు. చిట్వేలిలో ఏర్పాటు చేసిన తెదేపా కార్యాలయాన్ని సోమవారం ఆయన జన సేన పార్టీ రాష్ట్ర ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్రతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మండల యువతతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాయలసీమ జోన్ జనసేన బాధ్యుడు జోగినేని మణి, తెదేపా మండల బాధ్యుడు కేకే చౌదరి, నాయకులు బాలాజీ, నాగరాజు, గుండయ్యయాదవ్, మాదాసు శివ, సుబ్రహ్మణ్యం యాదవ్, కట్టా లోకేశ్, బి.రాజశేఖర్‌నాయుడు, యేదోటి రాజశేఖర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post