సచివాలయానికి వెళ్లే మార్గంలో తన స్థలం ఉందంటూ ఓ రైతు ఏకంగా దారి మొత్తాన్ని దున్నేసిన ఘటన వరదయ్యపాళెం మండలంలోని పాండూరులో చోటుచేసుకుంది. పాండూరు పంచాయతీలో సచివాలయ భవనాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని ఓ గదిని కూల్చి రెండేళ్ల కిందట నిర్మించారు. పాఠశాల స్థలం మీదుగా వెళ్లే దారి తనదంటూ దానిపై పట్టా పొందిన రైతు అభ్యంతరం చెప్పారు. దీంతో రైతుకు ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సచివాలయానికి దారి ఏర్పరిచారు. రెండేళ్లు గడుస్తున్నా న్యాయం చేయలేదంటూ రైతు శనివారం దారిని దున్నేయడంతో సచివాలయానికి దారి కరవైంది. సిబ్బంది విధులకు వెళ్లడానికి, ప్రజలు వివిధ అవసరాలకు పొలాల గట్టు మీద నుంచి నడవాల్సిన దుస్థితి నెలకొంది.
source : eenadu.net










Discussion about this post