రొద్దం పంచాయతీలోని కందుకూర్లపల్లిలో వాలంటీరు శనివారం ఇంటి పన్ను పట్టుకొని పింఛన్లు పంచారు. పడిపోయిన ఇంటికి సైతం పన్ను చెల్లించాల్సిందేని డిమాండ్ చేశారని, చేసేదిలేక రూ.157 చెల్లించినట్లు వృద్ధుడు వెంకటప్ప వాపోయాడు. మూడేళ్ల కిందట కురిసిన వర్షాలకు ఉన్న పాత ఇల్లు పడిపోవడంతో.. తన రెండో కుమారుడు నాగరాజు వద్దే నివాసం ఉంటున్నానని, ఈ విషయాన్ని సంబంధిత వాలంటీర్‌కు విన్నవించినా పట్టించుకోకుండా.. ఇంటి పన్ను కట్టాలని పింఛన్ డబ్బుల్లో పట్టుకొని ఇచ్చాడన్నారు. గ్రామంలో రూ.7వేల వరకు ఇంటి పన్ను పింఛన్‌లో పట్టుకున్నారని స్థానికులు తెలిపారు.
Discussion about this post