వైకాపా సభ కోసం 7 జిల్లాల్లో బడులకు సెలవు
1,000కి పైగా విద్యాసంస్థల బస్సుల తరలింపు
యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారుల బెదిరింపులు
11 జిల్లాల్లోని డిపోల నుంచి 1,357 ఆర్టీసీ బస్సులు
ఆ సభ కోసం ఏకంగా ఇంటర్మీడియెట్ పరీక్షే వాయిదా
జగన్ ప్రభుత్వం అన్నివిధాలుగా బరితెగించేసింది. నిబంధనల్ని, విలువల్ని పూర్తిగా గాలికొదిలేసింది. ‘సిద్ధం’ పేరుతో ఆ పార్టీ నిర్వహిస్తున్న ఫక్తు ఎన్నికల ప్రచార సభల కోసం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహిస్తున్న వైకాపా సభ కోసం శనివారం జరగాల్సిన ఇంటర్మీడియెట్ పరీక్షను వాయిదా వేసిన జగన్ ప్రభుత్వం.. ఏడు జిల్లాల పరిధిలోని విద్యా సంస్థల బస్సుల్ని మెడపై కత్తిపెట్టి లాగేసుకుంది. సభకు బస్సులు ఇవ్వాల్సిందేనని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల్ని విద్యాశాఖ అధికారులు బెదిరించి మరీ ఒప్పించారు. దీంతో ఏడు జిల్లాల పరిధిలోని ప్రైవేటు విద్యా సంస్థలు శనివారం సెలవు ప్రకటించాయి. వివిధ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సుల్నీ వైకాపా సభ కోసం కేటాయించేశారు.
source : eenadu.net
Discussion about this post