ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేని టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త రకం రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ ఓటమిని పసిగట్టిన చంద్రబాబు సానుభూతి ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కొత్త రాగం అందుకున్నారు.
కాగా, చంద్రబాబు తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు యాంకర్‌తో చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనను తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కామెంట్స్ చేశారు. అయితే, ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై చంద్రబాబుకు నమ్మకం లేకనే ఇలా కామెంట్స్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు, ఏపీలో వైఎస్సార్‌సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, మళ్లీ సీఎం జగన్‌నే గెలిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా టీడీపీ గెలవడం కష్టమని చంద్రబాబు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. సొంత పార్టీతో కాదని దత్తపుత్రుడిని కలుపుకున్నా చంద్రబాబుకు సత్తువ చేకూరలేదు. దీంతో, వైఎస్సార్‌సీపీపై గెలవడం కష్టం అన్న నిర్వేదంతో చంద్రబాబు సానుభూతి ప్రయత్నాలకు తెరలేపారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
source : sakshi.com
Discussion about this post