ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్ చేయూతపై చర్చ జరుగుతోంది. గ్రేడ్ 5 పంచాయితీ కార్యదర్శులకు విధివిధానాలు తెలియజేసే నింభందనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాఠశాల విద్య, గిరజన సంక్షేమ, బీసీ సంక్షమ, సాంఘిక సంక్షేమ సోసైటీలలో డీఎస్సీ 2024 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 6100 టీచర్ల పోస్టులకు భర్తీకి ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది.
ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్టు తెలుస్తోంది. జగనన్న తోడు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పథకాల ఆమోదం కోసం భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైతు భరోసా, సున్నా వడ్డీ, ఇన్ ఫుట్ సబ్సిడీ, పంట బీమా కలిపి నాలుగు వేల కోట్ల బకాయిలు అక్టోబర్ నెలల్లో చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పటికీ సున్నా వడ్డీ చెల్లించలేదు. డిసెంబర్ నెలలో ఇస్తామని చెప్పిన పంటల బీమా ఇప్పటి వరకూ అమలు చేయలేదు. జనవరిలో చెల్లించాల్సిన రైతు భరోసా గురించి జగన్ ప్రభుత్వం మరిచిపోయింది.
ఈ క్రమంలోనే ఎన్నికల ముందు రుణమాఫీ అని కొత్త ఎత్తులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ అని ప్రచారం చేస్తోంది. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్‌లో కీలక నిర్ణయం అని లీకులు ఇచ్చింది. ‘ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ అంశం. డీఎస్సీ నోటిఫికేషన్. అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం‘ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది.
source : andhrajyothi.com
Discussion about this post