అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడి భరోసా ఇచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పత్తికొండలో చంద్రబాబును కలిసి విన్నవించారు. ఆదివారం నిర్వహించిన రా..కదలిరా సభ అనంతరం ఆయన స్థానిక గోపాల్‌ప్లాజాలో బస చేశారు. బాబును కలిసేందుకు సోమవారం ఉదయం నేతలు వచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు కేఈ శ్యాంబాబు, కోట్ల సుజాతమ్మ, తిక్కారెడ్డి, మీనాక్షినాయుడు ఆయనను కలిశారు. ముఖ్య నేతలు గుడిసె కృష్ణమ్మ, బత్తిన వెంకటరాముడు, తుగ్గలి నాగేంద్ర, వీరభద్రగౌడ్, పురుషోత్తం చౌదరి, మనోహర్‌చౌదరి, తిమ్మయ్య చౌదరి, సాంబశివారెడ్డి, రామానాయుడు, తిరుపాలు, తుగ్గలి జడ్పీటీసీ మాజీ సభ్యురాలు వరలక్ష్మి, రాజన్నయాదవ్, సురేశ్‌చౌదరి తదితరులూ కలిశారు.
source : eenadu.net
Discussion about this post