‘‘అమరావతి రాజధాని కోసం.. తెలుగువారి ఆత్మగౌరవం.. రైతుల సంక్షేమం.. యువతకు ఉద్యోగాల కల్పన.. మహిళా సాధికారత సాధనకు.. రాతియుగాన్ని పారద్రోలి.. స్వర్ణయుగాన్ని సాధించుకునేందుకు.. తెలుగుజాతిని నంబర్ వన్‌గా చేయడం కోసం.. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కదలిరావాలి. ప్రతి గడప రా.. కదలిరా అనే నినాదం వినిపించాలని’’ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. పొన్నూరు పౌరుషం చూపించి తెదేపా-జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ‘జగన్ అనే సైకో ఊరికో సైకోను తయారు చేశాడు. ఈ అహంకారి పాలనను తరిమేయడం తథ్యం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కాపాడడానికే మీముందుకొచ్చానని’ వివరించారు. చేబ్రోలు మండలం క్వారీ సమీపంలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు తెదేపా-జనసేన శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
source : eenadu.net
Discussion about this post