ఐఆర్‌ఆర్(ఇన్నర్ రింగ్ రోడ్) భూకుంభ కోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఈనెల 10వ తేదీన ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇన్నర్ రింగ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర,
ఎక్సైజ్ శాఖ అప్పటి కమిషనర్ శ్రీ నరేష్ లకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కాగా, ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.
source : sakshi.com
Discussion about this post