వైకాపా ప్రచార పిచ్చి రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన భవనాలనూ వైకాపా నాయకులు వదలడం లేదు. బత్తలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం-2 భవనంపై మా నమ్మకం నువ్వే జగన్ అనే బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై వ్యవసాయాధికారి ఒ.బి.రెడ్డిని వివరణ కోరగా రైతు భరోసా కేంద్రం భవనాన్ని గుత్తేదారులు ఇంకా తమకు అప్పగించలేదని తెలిపారు.
source : eenadu.net
Discussion about this post