శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో ఉన్న శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయము చాలా ప్రసిద్ధి చెందినది. దేవాలయ నిర్మాణము, ఇక్కడి శిల్ప సంపద, స్థల మహిమ మరియు ఇక్కడి ప్రజల సంస్కృతి సంప్రదాయాల నుంచి మనం ఎంతో తెలుసుకోవచ్చు.
విగ్రహ సంపదలో వినాయకుడు, భైరవుడు, దక్షిణామూర్తి విగ్రహం, సూర్య దేవుడు, పరశురాముడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, సప్తమాతికేలా విగ్రహం, వీణాధారశివుడు ఇంకా ఎన్నెన్నో పూడికతీతల్లో అనేకం లభిస్తున్నాయి.
మహేశ్వరుడు ఉమాదేవిల ఆదర్భ దంపతుల విగ్రహాలు మరియు ఇంద్రాణి, వరాహమూర్తి విగ్రహాలు, నెమలి వాహన కుమారస్వామి విగ్రహాలను మనం చూడవచ్చును. ప్రధాన ఆలయంలోని శివుని సహజరూప విగ్రహంలాంటి చిన్నదైన భైరవరూప విగ్రహం కూడా మ్యూజియంలో భద్రపరచారు.
హేమావతిలోని మ్యూజియంలో ఎన్నెనో ప్రత్యేకమైన విగ్రహాలు చాలా ఆకర్షణీయం.
Discussion about this post