కుందుర్పి:
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మలయనూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలయనూరుకు చెందిన మాల తిప్పేస్వామి(47) మద్యానికి బానిసై భార్య యల్లమ్మతో రోజూ గొడవపడేవాడు. శుక్రవారం ఉదయం మద్యం కోసం తిప్పేస్వామి తన భార్యతో గొడవ పడ్డాడని సమాచారం.
అయితే తన వద్ద డబ్బులు లేవని భార్య చెప్పడంతో మనస్తాపం చెంది గ్రామ శివారులోని చెక్‌పోస్టు సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యతోపాటు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
Discussion about this post