తాడిపత్రి:
బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి జెసి ప్రభాకర్‌రెడ్డిని కోరారు. పట్టణంలో అభివృద్ధి పనుల్లో పాల్గొన్న కాంట్రాక్టర్లు, కార్మికులపై బెదిరింపులు, వేధింపులకు నిరసనగా గురువారం జెసి ప్రభాకర్ ఇంటిని ముట్టడించేందుకు ఆయన బయలుదేరారు.
డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక అశోక్ పిల్లర్ సర్కిల్‌ను అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విలేకరులతో మాట్లాడారు.
రెండు రోజుల క్రితం 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి వాట్సాప్ కాల్‌లో పనులు చేపట్టవద్దని బెదిరించారు. పనులు చేపట్టకుండా ఇతర కార్మికులకు కమీషన్లు ఇప్పించాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు.
మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ మరమ్మతు పనులను తన సొంత ఖర్చులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. నిత్యం మట్కా, జూదం, వ్యభిచారం చేసే నలుగురిని తన దగ్గరే పెట్టుకుని మాయమాటలు చెబుతూ కాలం గడిపేస్తుంటాడు. కొందరు టీడీపీ కౌన్సిలర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికీ లుచ్చా పనులు చేసుకుంటూ చికెన్ సెంటర్ల నుంచి కిలోకు పది రూపాయలు కమీషన్ తీసుకుంటూ జీవిస్తున్నారని ధ్వజమెత్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి స్థాయికి దిగజారాలన్నారు.
ఓ మహిళను దారిలో పెట్టి అధికార పార్టీ నేతలను, సీఎంను తిట్టిస్తున్నారని అన్నారు. పదుల సంఖ్యలో కేసుల్లో నిందితురాలిగా ఆమెను వాడుకుంటున్నాడు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్యా లేక ఆయన కుమారుడా లేక సోదరుడు దివాకర్ రెడ్డా లేక ఆయన కుమారుడా అనేది ప్రజలు తెలుసుకోవాలన్నారు.
ఎవరికి పుట్టానో అంటూ మున్సిపల్ కమిషనర్‌ను బెదిరించిన నువ్వు.. ఎవరికి పుట్టావో ముందు చెప్పాలి..తాడిపత్రిలో మళ్లీ వైఎస్‌ఆర్ సీపీ జెండా రెపరెపలాడుతోంది.ఏప్రిల్ తర్వాత స్టువర్టుపురం వెళ్లాలా.. గద్వాలకు వెళ్లాలా అని తేల్చిచెప్పారు. అన్నారు.
Discussion about this post