కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిరుతల మల్లికార్జున పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజా రెడ్డి, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిరుతల మల్లికార్జున పిలుపునిచ్చారు.
గురువారం అనంతపురంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో ఏఐటీయూసీ, రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ముద్రించిన పుస్తకాలను విడుదల చేశారు.
గత ఎన్నికల ముందు తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని, మద్దతు ధర, కరెంటు బిల్లు సవరణను ఉపసంహరించుకుంటామని మోదీ చెప్పారు. రాష్ట్రంలో రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ అన్నదాతలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ నెల 7న సత్యసాయి జిల్లాలో పర్యటించిన సీఎం.. రైతులతో భేటీకి అనుమతి లేదన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, నగర కార్యదర్శి కృష్ణుడు, జిల్లా కార్యదర్శులు రాజు, శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా నాయకులు వన్నారెడ్డి, మనోహర్, వెంకటనారాయణ, రామకృష్ణ, రాము పాల్గొన్నారు.
Discussion about this post