అనంతపురం:
నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామాలను కూడా అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం (పీఎంజీఎస్‌వై)-111 కింద ఉమ్మడి జిల్లాలో రూ.63.54 కోట్ల నిధులతో పొడవైన వంతెనలు, గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది వంతెనలకు రూ.52.96 కోట్లు కేటాయించగా, మూడు పొడవైన రోడ్లకు రూ.10.58 కోట్లు కేటాయించారు.
అనంతపురం జిల్లాలో ఐదు పొడవైన వంతెనలకు రూ.36.55 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.16.41 కోట్లతో మూడు వంతెనలకు మరమ్మతులు చేయనున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో రెండు పొడవైన రహదారులకు రూ.8.45 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒక రహదారికి రూ.2.13 కోట్లు కేటాయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Discussion about this post