జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీలోపు జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పురోగతిపై ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి సమీక్షించనున్నట్లు వెల్లడించారు. స్థలాలు తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టని వారి పట్టాలను రద్దు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులను పకడ్బందీగా పంపిణీ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాకు 3,08,544 కార్డులు వచ్చాయని తెలిపారు. వాటిని ఎంపీడీఓలకు అందజేసినట్లు చెప్పారు. సంబంధిత ఎంపీడీఓలు ఈ మేరకు కార్డులను పంచాయతీ సెక్రటరీల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయించాలన్నారు. ఆదివారం ఆయా కార్డుదార్లు ఈకేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ రాజశేఖర్, జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, డీపీఓ లక్ష్మి, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ ప్రభావతి, ఆరోగ్య శ్రీ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్, డీఎల్‌డీఓ రవికుమార్ పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post