ఈ నెల 5న ధర్మవరానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ వస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా భాజపా అధ్యక్షుడు జీఎం శేఖర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎన్‌డీఏ ఎన్నికల ప్రచార కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన భాజపా నాయకులతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అమిత్‌షా, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ రానున్నారన్నారు. ఎన్‌డీఏ అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా ధర్మవరంలో నిర్వహించే బహిరంగ సభలో వారు పాల్గొంటారన్నారు. భాజపా, తెదేపా, జనసేన పార్టీల శ్రేణులతోపాటు ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్ విజయం సాధిస్తే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ధర్మవరంలో జరుగుతున్న అరాచకపాలనను సత్యకుమార్ ప్రశ్నిస్తున్నందున ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమి భయంతో అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు.
source : eenadu.net
Discussion about this post